Sports Quota in Jobs | ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంపు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంపు
స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా విధానానికి ఆమోదించిన ఏసీ సీఎం చంద్రబాబు
గ్రామాల నుంచే క్రీడలను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశాలు
Hyderabad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యుతకు వరాలు కురిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల కోసం స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నూతన స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష జరిగింది. ఏపీలో కొత్తగా తీసుకువస్తున్న స్పోర్ట్స్ విధానం దేశంలోనే ఉత్తమ క్రీడా విధానంగా ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో విధానం రూపకల్పన చేయాలన్నారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ ప్రాతిపదికగా విధానాలను రూపొందించాలన్నారు. గ్రామ స్థాయి నుంచే క్రీడల ప్రోత్సాహకానికి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. శాప్‌లో గ్రేడ్ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ఈ సందర్భంగా ఏపీ సీఎం తెలిపారు.
* * *
Leave A Comment